జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు
– జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ “వి”క్టరీ..
– సోమాజిగూడ డివిజన్ 288లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన కాంగ్రెస్.
– సెంటిమెంట్ తో బిఆర్ఎస్ ఎన్ని రాజకీయాలు చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు.
– ఉప ఎన్నిక గెలుపు ద్వారా కాంగ్రెస్ లో నయా జోష్..
హుజురాబాద్, నేటి ధాత్రి:
జూబ్లిహిల్ ఎన్నికల్లో గెలవడం ద్వారా అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ మా పై మరింత బాధ్యత పెరిగిందని,రాష్ట్రంలో అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని మరోసారి రుజువైందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల వైఫల్యాలను ఎండగడుతూ,రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించామని,ఇలాంటి తీర్పు ద్వారా అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తామని అన్నారు.ఉప ఎన్నికల్లో రామగుండం శాసన సభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రణవ్ సోమాజిగూడ 288 బూత్ లో మంచి మెజారిటీ సాధించారు,ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీగా జూబ్లిహిల్స్ ఎన్నికల్లో ఒక బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ను నిలబెట్టడం ద్వారా బీసీలపై నిజమైన కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉందని మరోసారి రుజువైందని అన్నారు.నూతనంగా ఎమ్మెల్యే గా ఎన్నికైన నవీన్ కుమార్ యాదవ్ కి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ,హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు.ప్రధాన కూడళ్లలో బాణాసంచా కాలుస్తూ,మిఠాయిలు తినిపించుకున్నారు.ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అబద్ధపు ప్రచారాలతో,సెంటిమెంట్ తో ఎన్ని రాజకీయాలు చేసినా జూబ్లిహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు.ఇదే జోష్ లో రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
