-తక్షణమే ఎల్లంపల్లి నీరు అందించాలని బిజెపి నాయకుల డిమాండ్
చందుర్తి, నేటిధాత్రి:
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చందుర్తి లో ఎండిపోయిన పొలాలను మరియు ఎండిపోయిన నీటి కాలువను నాయకులు రైతులు కలిసి పరిశీలించి నీటిని విడుదల చేయాలని నిరసన చేశారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ మరో 10, 20 రోజుల్లో చేతికొచ్చే పంట కళ్ళ ముందు ఎండిపోతుంటే రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని, ప్రభుత్వం 15 రోజుల క్రితం నీటిని విడుదల చేసి కేవలం మూడు రోజుల్లో నీటిని ఆపేయడం చాలా హేయమైన చర్య అని, రైతులను ఆదుకోవడానికి వెంటనే ఎల్లంపల్లి నీటిని చందుర్తి మండలంలోని అన్ని చెరువుల్లో నింపాలని, లేనిపక్షంలో మండలంలోని రైతులందరికీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలోబిజెపి మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శిలు చింతకుంట గంగాధర్, చిర్రం తిరుపతి, పేరుకు గంగరాజు, చింతకుంట సాగర్, మర్రి రాజు, పేరుకు రంజిత్, తిప్పని భూమేష్, కూతురు మహేందర్ రెడ్డి, లింగాల పెద్దిరెడ్డి, మర్రి రాజేశం, సిరికొండ తిరుపతి, బాలవేణి మహేష్ లింగంపల్లి లక్ష్మణ్, లింగంపల్లి హరీష్, భత్తుల మధు, బత్తుల జ్యోతి, మెడికల్ సుభాష్, మోత్కుపల్లి నరేష్, ఒట్టేల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.