ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య.
చిట్యాల, నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలో, గ్రామాల్లో నెలకొన్న దళిత బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకునేందుకు మరియు అంబేద్కర్ యువజన సంఘాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని జిల్లాలో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ నెల 3,9,10 ,17 తేదీలలో కొన్ని జిల్లాలలో సమావేశాలు జరిగాయని ఆయన చెప్పారు. అలాగే 24న సిద్దిపేట మెదక్ సంగారెడ్డి జిల్లాలో 31న కరీంనగర్ పెద్దపల్లి , సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో ఏప్రిల్ 7న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో ఏప్రిల్ 21న మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జోగుళాంబ , గద్వాల , నారాయణ పేట , వనపర్తి, జిల్లాలో ఏప్రిల్ 28న వరంగల్, హన్మకొండ, మహబూబా బాద్ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం జిల్లాల సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్. అయలయ్య తో పాటు ఇతర నాయకులు పాల్గొంటారు అని తెలిపారు. జిల్లాల వారీగా జరుగుతున్న సమీక్ష సమావేశాలను అంబేద్కర్ వాదులు మేధావులు ఉద్యోగులు వివిధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ మండల అధ్యక్షులు సరిగొమ్ముల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.