వాసుళ్లే వసూళ్లు టి జి ఎండిసి వసూళ్ల పర్వం.

T G MDC

వాసుళ్లే వసూళ్లు.

టి జి ఎండిసి వసూళ్ల పర్వం,

శాఖ సిబ్బంది అయి ఉండి కాంట్రాక్టర్ గుమస్తాగా వసూళ్లు.

ఈ ఐదు క్వారీల పై చర్యలు తీసుకునే సత్తా అధికారులకు లేదు.

అంతా అధికారుల కనుసైగల్లో, అందుకే దర్జాగా వసూళ్లు

టిజిఎండిసి నిద్ర మత్తు వీడడం లేదు, వసూళ్లు ఆగడం లేదు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా టిజిఎండిసి వ్యవహారం.

మహదేవపూర్- నేటి ధాత్రి:

 

 

మండలంలోని ఐదు ఇసుక రీచు లో మాత్రం వసూళ్ల పర్వం ఆగడం లేదు, తాజాగా పలుగుల ఎనిమిది ఇసుక క్వారీలో టిఎస్ఎండిసి సిబ్బంది, డ్రైవర్ల దగ్గరినుండి దర్జాగా వసూళ్ల పర్వం కొనసాగించడం ఆశ్చర్యకరం. కాలేశ్వరం పరిధిలోని పలుగుల ఎనిమిది, పలుగుల తొమ్మిది, పుసుపల్లి పలువుల సిక్స్, పుసుపల్లి ఒకటి, మహాదేవపూర్ పుసుక్పల్లి ఒకటి, ఈ ఐదు ఇసుక రీచుల్లో ఇసుక కాంట్రాక్టర్లకు గుమస్తాగా టీఎస్ఎండిసి సిబ్బంది వ్యవహరిస్తూ, వసూళ్ల పర్వం కొనసాగించడం జరుగుతుందన్న విషయం ఇప్పటికే, సాక్షాలతో తేర పైకి తీసుకురావడం కూడా జరిగింది, తాజాగా సోమవారం రోజు, పలుగుల 8 ఇసుక క్వారీలో టీఎస్ఎండిసి సిబ్బంది డ్రైవర్ల నుండి వసూళ్ల పర్వం కొనసాగించడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఐదు క్వారీల అక్రమ వసూళ్ల వ్యవహారం, తేర పైకి వస్తున్న క్రమంలోని టీజీఎండిఎస్ సిబ్బంది వసూళ్ల పరంపర మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగించడం వెనుక అధికారుల హస్తం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.

వాసుళ్లే వసూళ్లు.

T G MDC
T G MDC

 

కాలేశ్వరం పరిధిలోని ఐదు ఇసుక రిచుల్లో అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక శరమాములుగానే కొనసాగుతుంది. అడిగే నాథుడు లేకపోవడంతో,పలుగుల ఎనిమిది, పలుగుల తొమ్మిది, పుసుపల్లి పలువుల సిక్స్, పుసుపల్లి ఒకటి, మహాదేవపూర్ పుసుక్ పల్లి, ఒకటి, ఈ ఇసుక క్వారీలో కాంట్రాక్టర్ల పెత్తనానికి టి జి ఎం డి సి సిబ్బంది వసూళ్ల పర్వాన్ని రెట్టింపు ఉత్సాహంతో కొనసాగిస్తున్నారు. ఈ ఐదు ఇసుక రీచులకు సంబంధించి అక్రమ వసూళ్లు, లోడింగ్ వద్ద అదనపు రూపాలు తీసుకోవడం, సీరియల్ పేరుతో 700 నుండి 1200 వరకు ఈ క్వారీల్లో లారీల నుండి డబ్బులు వసూలు చేయడం, కాంటాల వద్ద పాసింగ్ పై అదనపు ఇసుక వేసి మరో 500 రూపాయలు తీసుకోవడం, ఇలాంటి వ్యవహారాలను సాక్షాలతో తేర పైకి తీసుకురావడం జరిగినప్పటికీ నేటికీ టీజీఎండిసి, చర్యలకు మాత్రం ససేమీరా అంటుంది.

టి జి ఎండిసి వసూళ్ల పర్వం,

T G MDC
T G MDC

 

 

 

బాధ్యతగా వ్యవహరించాల్సిన టీజీఎండిసి సిబ్బంది స్వయంగా వసూళ్ల పర్వం కొనసాగిస్తే ,లారీ డ్రైవర్ అక్రమాలు అదనపు వసూళ్ల వ్యవహారం ఎవరికి చెప్పుకుంటారు, కేవలం టీజీఎండిసి సిబ్బంది వసూళ్లకే పెట్టినట్టు వారి ఏకైక లక్ష్యం అదనపు వసూళ్లు పాసింగ్ పై అదనపు అక్రమ ఇసుక రవాణా చేసి మరింత డబ్బులు వసూళ్లు చేసి, కాంట్రాక్టర్ మరియు అధికారులకు కట్టబెట్టడమే లక్ష్యంగా పీజీఎండిసి సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు. కానీ శాఖ ఏర్పాటు చేసిన సిబ్బంది అవకతవకలు జరగకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా, కాంట్రాక్టర్ అక్రమాలు చేపడితే వారిపై చర్యలు తీసుకునుటకు శాఖ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా సిబ్బంది కాంట్రాక్టర్ కు గుమస్తాలుగా మారి కేవలం వసూళ్ల కొరకే తాము ఉన్నామంటూ దర్జాగా వసూలు చేస్తున్నారు.

ఈ ఐదు క్వారీల పై చర్యలు తీసుకునే సత్తా అధికారులకు లేదు.

T G MDC
T G MDC

 

 

 

ప్రస్తుతం మండలంలో పెద్ద మొత్తంలో ఇసుక రీచుల నుండి ఇసుక రవాణా చేస్తున్న మహాదేవపూర్ కాలేశ్వరం పరిధిలోని పలుగుల ఎనిమిది, పలుగుల తొమ్మిది, పుసుపల్లి పలుగుల సిక్స్, పుసుక్ పల్లి ఒకటి, మహాదేవపూర్ పుసుక్ పల్లి ఒకటి, ఈ ఐదు ఇసుక క్వారీల్లో ఎన్ని అక్రమాలు జరిగిన, సాక్షాలతో తెరపైకి తీసుకువచ్చిన, అధికారులకు మాత్రం ఈ ఐదు క్వారీల పై చర్యలు తీసుకునే సత్తా లేదని గ్రామాల్లో చెప్పుకొస్తున్నారు. ఈ క్వారీల యజమానులు రాజకీయంగా పలుకుబడి, అధికారులకు లంచాలు ఇవ్వడం జరిగింది, కనుక అందుకే ఈ క్వారీలపై ఏలాంటి చర్యలు ఉండవని స్థానికులు చెప్పుకొస్తున్నారు. స్థానికుల విషయం వాస్తవమే అని చెప్పుటకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈ ఐదు ఇసుక క్వారీల్లో టీఎస్ఎండిసి సిబ్బంది గుత్తేదారుల గుమస్తాలుగా మారి వ్యవహరిస్తున్న సాక్షాలు, అక్రమ వసూళ్ల వ్యవహారం సాక్షాలతో తెరపైకి వచ్చిన కిందిస్థాయి అధికారి నుండి ఉన్నత అధికారి వరకు ఏలాంటి చర్యలకు ఆదేశించకపోవడం, అధికారులు లంచాలు తీసుకున్నారని గ్రామాల్లో ప్రజల మాటలు వాస్తవం అనిపించేలా కనబడుతుంది.

అంతా అధికారుల కనుసైగల్లో, అందుకే దర్జాగా వసూళ్లు.

ఇసుక క్వారీల అక్రమ వసూళ్లు అదనపు ఇసుక వ్యవహారం, గుట్టుచప్పుడు కాకుండా జరగడం లేదు, ఈ క్వారీల్లో వసూళ్లు చేస్తున్న టీజిఎండిసి సిబ్బంది అధికారులకు కూడా వాటా ఉండడంతో, అంతా అధికారుల కనుసైగల్లోనే అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక, వ్యవహారం దర్జాగా కొనసాగుతుందని చెప్పడానికి సందేహ పడాల్సిన అవసరం లేదు, అక్రమ వసూళ్లలో వాటాదారులు గా అధికారులు ఉండకపోతే సాక్షాలు తెరపైకి వచ్చిన 20 రోజులుగా వరుస కథనాలు వచ్చినా కూడా, ఏ అధికారి కూడా ఈ క్వారీలపై విచారణకు రాకపోవడం, ఏలాంటి చర్యలకు ఆదేశించక పోవడం, రోజురోజుకు వసూళ్ల పర్వం మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగడం, ఈ వ్యవహారా లాన్నిటిని గమనిస్తే అధికారులు కూడా వాటాదారులేనని స్పష్టమవుతుంది.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా టిజిఎండిసి వ్యవహారం.

మండలంలో ఇసుక క్వారీల అక్రమ వసూళ్ల వ్యవహారం అదనపు ఇసుక రవాణా కాసుల కొరకు కక్కుర్తి పడుతున్న కాంట్రాక్టర్ మరియు వారికి గుమస్తాలుగా వ్యవహరిస్తున్న టీజీఎండిసి సిబ్బంది వసూళ్లపర్వంతో, అధికారులకు వాటాలు పంపించి, శాఖపరమైన చర్యలు లేకుండా అక్రమ వసూళ్ల వ్యవహారం కొనసాగించడం, వాస్తవాలు సాక్షాలు తెరపైకి వస్తున్న క్రమంలో, టీజీఎండిసి చర్యలు తీసుకోకుండా ఉండడంతో, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రాక తప్పడం లేదు, ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణా అక్రమాలపై “డెడ్లైన్” విధించి ఉన్నప్పటికీ, టి జి ఎం డి సి అమలు చేయకపోవడం ఇసుక క్వారీలో అక్రమాలు మరింత పెరగడం, ప్రజల్లో ప్రభుత్వ ఆదేశాలకు విలువ లేకుండా ఉందని చెప్పుకునేలా వ్యవహరిస్తుంది టిజి ఎండిసి, అక్రమ వసూళ్లు అదనపు ఇసుక రవాణా చేస్తున్న ఈ ఐదు క్వారీలపై ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే ఈ ఇసుక క్వారీలపై చర్యలతో పాటు వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నత అధికారులపై ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!