-రాములమ్మకు మంత్రి యోగం.
-త్వరలో మంత్రిగా రాములమ్మ.
-మలి తరం తెలంగాణ ఉద్యమానికి తొలి మహిళ.
-తల్లి తెలంగాణ పార్టీతో పోరాడిన ధీర వనిత.
-మహా మహా నాయకులే పార్టీ నడపలేదు.
-మహిళగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నింపారు.
-జయశంకర్ సార్ కోరిక మేరకు పార్టీని విలీనం చేశారు.
-లేకుంటే రాములమ్మ రాజకీయం మరో లెవల్‌లో వుండేది.
-మొదట జై తెలంగాణ అన్న వాళ్లెందరో వెనుకడుగు వేశారు.
-తెలంగాణ ప్రకటన వచ్చే దాక రాములమ్మ అలుపెరగని పోరాటం చేశారు.
-తెలంగాణ బిల్లు రోజు ప్రాణాలకు తెగించి స్పీకర్‌కు అండగా నిలబడ్డారు.
-తెలంగాణ బిల్లు చించేయాలని చూసిన వారికి అందకుండా రక్షణగా నిలిచారు.
-సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా ఆమె సూపర్ స్టార్ అనిపించుకున్నారు.
-రాజకీయ కుయుక్తులు తెలియక నమ్మి మోసపోయారు.
-కాలం మళ్ళీ సమాధానం చెప్పే అవకాశం రాములమ్మకు ఇచ్చింది.
-ఇప్పుడు రాములమ్మ టైమ్ మళ్ళీ వచ్చింది.
-అప్పుడు ఉద్యమం… ఇప్పుడు అసలైన రాజకీయం.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయాల్లో అందరూ నిస్వార్ధ పరులువుండరు. కాని కొంత మంది మాత్రమే ఎలాంటి స్వార్ధం లేకుండా, ప్రజల కోసం జీవితం త్యాగంచేస్తుంటారు. వారి భవిష్యత్తు ఫణంగా పెట్టి ప్రజల కోసం నిలబడతారు. కేవలం తన ప్రజల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తారు. అయితే అందులోనూ అటు ప్రజల కోసం, ఇటు తన మాతృభూమి కోసం కొంత మందే త్యాగాలు చేస్తుంటారు. అలాంటి అతి కొద్ది మందిలో తెలంగాణ ఉద్యమ కెరటం విజయశాంతి ఒకరు. తెలంగాణ అనే ఉద్యమం లేకుండా వుంటే ఆమె రాజకీయాల్లోకి వచ్చేవారు. కాని తన ప్రాంత ప్రజలు కొన్ని దశాబ్ధాలుగా సొంత రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బకడం ఆమెను కలిచివేసింది. ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతం పచ్చగా, మరో ప్రాంతం ఎడారిగా వుండడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఒక ప్రాంతమంతా పాడి పంటలతో సస్యశ్యామలంగా వుంటే, మరో ప్రాంతంలో కనీసం తగడానికి చుక్క నీరు దొకరని దుస్ధిని చూసి ఆమె చలించిపోయారు. ఆంద్రా ప్రాంతలో సీటి సవ్వడులతో ఏడాదంతా గళగళాపారే నీళ్లులో పచ్చని పొలాలు, అందమైన ప్రకృతి, సంతోషంలో ప్రజలు, ఆర్ధికంగా వారి ఉన్నత స్ధితిని చూసిన రాములమ్మ, నా ప్రాంతం ఏం పాపం చేసుకున్నది అని తల్లడిల్లిపోయింది. గోదావరి, కృష్ణ నదులు తెలంగాణ నుంచే పారుతుంటాయి. ఎక్కువ శాతం తెలంగాణ నుంచే వెళ్తుంటాయి. తలాపున గోదావరి వున్నా ఉత్తర తెలంగాణ, పక్కనే కృష్ణ పరుగులు పెడుతున్నా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలు పలుగు రాళ్లు తెలి, బీళ్లు కనిపిస్తుంటే ఆమె గుండె చెరువైంది. దశాబ్ధాలుగా తెలంగాణ ప్రజలు కోరుతూనే వున్నారు. మాకు నీళ్లు కావాలని పోరాటాలు చేస్తూనే వున్నారు. కాని అప్పటి పాలకులుపట్టించుకోలేదు. కనీసం తెలంగాణ బతుకులను కూడా చలించలేదు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నా చేయూతనివ్వలేదు. తెలంగాణ యువతకు పనిలేదు. తెలంగాణ రైతులు సాగు చేసే పరిస్ధితి లేదు. కనీసం తెలంగాణలో వున్న గొలుసు కట్టు చెరువులు నింపినా కాని, కనీసం తెలంగాణ ఎంతో కొంత బాగుపడేది. తెలంగాణ రైతు కన్నీళ్ల వ్యవసాయం చేయాల్సిన అవసరం వచ్చేదికారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు కాకముందే నిర్మాణం చేయాలనుకున్నా పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినా కనీసం తెలంగాణలో సాగు సాగేది. ఏ రకంగా చూసినా తెలంగాణ అంతగా వెనుకబడేదికాదు. తెలంగాణ పల్లెలు వలసలు పోయవి కాదు. బొంబాయి, బొగ్గుబాయి, అప్పులు చేసి దుబాయిలకు వెళ్లే పరిస్దితి వచ్చేదే కాదు. తెలంగాణను పూర్తిగా ఎండబెట్టి, ఆంద్రాకు నీళ్లన్నీ తరలిస్తూ, తెలంగాణ రైతుల ఆత్మహత్యల పరంపరసాగుతున్నా కనీసం పట్టించుకోలేదు. పైగా తెలంగాణ రైతులు ఎక్స్‌గ్రేషియా కోసం చనిపోతున్నారని కూడా ఎద్దేవా చేసిన ఆంద్రా నాయకులు ఎద్దేవా చేసేవారు. తెలంగాణ భూముల్లో పంటలు కాదు, కనీసం తొండలు గుడ్లు పెట్టేందుకు కూడా పనికి రావంటుండేవారు. ఇదిలా వుంటే పుండు మీద కారం చల్లినట్లు, రైతాంగానికి ఇచ్చే కరంటు చార్జీలు విపరీతంగా పెంచారు. తెలంగాణ ప్రాంతానికి సాగు నీరందించాలంటే ఎత్తిపోతల ప్రాజెక్టులే శరణ్యం. వాటిని నిర్మాణాలు చేయలేం. రైతుల కోసం తెల్ల ఏనుగులాంటి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఏటా అయ్యే ఖర్చును భరించలేమంటూ ఆంద్రా పాలకులు అంటుండేవారు. అంతే కాకుండా రైతులు ఆత్మగౌరవం మీద అడుగడుగునా దెబ్బ కొడుతుండే వారు. ఏపిలో చిన్న చినుకు పడి చేను చెడిపోయినా, పరిహారం అందించేవారు. కాని తెలంగాణలో అకాల వర్షాలుకు పంటలు చెడిపోయినా పట్టించుకునేవారు కాదు. ఎండలకు పంటలు ఎండిపోయి, సరైన నీరందక పంటలు పొట్టకొచ్చేదశలో చేతికి రాకుండాపోయినా కనీసం అయ్యే అని కూడా అనేవారు కాదు. ఇవన్నీ దాటుకొని రైతు పంట పండిస్తే గిట్టుబాటు ధర ఇచ్చేవారు కాదు. రైతుకు ఎప్పుడూ కష్టమే.. ఇవన్నీ చూసి రాములమ్మకు కుడపు తరుక్కుపోయింది. దాంతో సినీ రంగాన్ని ఏలుతున్న ఉచ్చ దశలో ఆ రంగాన్ని వదిలేశారు. అప్పటి నుంచి సినిమా వైపు చూడలేదు. సినిమా గురించి ఆలోచించేలేదు. వస్తూ, వస్తూనే తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ మొత్తం కలియ తిరిగారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేశారు. అనేక ఉద్యమాలు చేపట్టారు. ఓ వైపు కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని, తాను సంపాదించిన కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. అయితే ఇదే సమయంలో కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి సాగుతోంది. అంతకుముందే ఆలెనరేంద్ర తెలంగాణ సాధన సమితి ఏర్పాటు చేశారు. అప్పటికే నరేంద్ర పార్టీని కేసిఆర్ పార్టీలోవిలీనం చేశారు. అలా రెండు పార్టీలు కలవడంతో తెలంగాణ ఉద్యమం మరింత బలపడిరదని ప్రొఫెసర్. జయశంకర్ సార్ అంచనావేశారు. అదే సమయంలో తల్లి తెలంగాణ పార్టీ ఊరూరా రెపరెపలాడుతోంది. ఆసమయానికి విజయశాంతి తెలియని వారులేరు. ఒక రకంగా చెప్పాలంటే కేసిఆర్ కంటే రాములమ్మ తెలంగాణ ప్రజలకు ఎక్కువ తెలుసు. రాములమ్మ సినిమాతో ప్రతి గుడెసికు ఆమె పేరు చేరిపోయింది. అలా తెలంగాణ మాస్ ప్రజలకు కూడా ఆమె పేరు చేరిపోయింది. అలా కేసిఆర్ కంటే ఎక్కువగా తెలంగాణ సమాజానికి తెలిసిన రాములమ్మ పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని జయశంకర్ సార్ ప్రతిపాదన పంపించారు. ఆయన మాట మీద నమ్మకంతో మాత్రమే తెలంగాణ సాధన కోసమే రాములమ్మ తన పార్టీని కేసిఆర్ పార్టీలో విలీనం చేశారు. లేకుంటే ఇప్పటికీ ఆ పార్టీ వుంటే రాములమ్మ రాజకీయం వేరుగా వుండేది. తెలంగాణలో అప్పటికే తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూగా వున్నా దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ అని పార్టీ ఏర్పాటు చేశారు. కాని ఆయన పట్టుమని పది నెలలు కూడా నడిపించలేకపోయారు. తన పార్టీని నడపలేక, సామాజిక తెలంగాణ నినాదంతో వచ్చిన చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీలో ఆ పార్టీని విలీనం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి లాంటి నటుడు కూడా పార్టీని నడపలేక జెండా పీకేశారు. జయశంకర్‌లాంటి వారితో చెప్పించి, కేసిఆర్ తన పార్టీ తప్ప మరో పార్టీ వుండడానికి వీలు లేదని తల్లి తెలంగాణపార్టీ గొంతు కోశాడు. నిజంగా ఆమె పార్టీ అలాగే వుంటే ఇప్పుడు తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీగా వెలుగొందుతూనేవుండేది. మొదట్లో విజయశాంతికి ప్రాదాన్యతనిచ్చినట్లే కనిపించినా, ఆలె నరేంద్ర రాజకీయాన్ని ఎలా తుంచి వేశారో అలాగే విజయశాంతిని కూడా రాజకీయాలకు దూరం చేయాలనుకున్నారు. చెల్లి, చెల్లి అంటూ నమ్మించి తన రాజకీయ అవసరాల కోసం, తల్లి తెలంగాణ పార్టీని ఆనవాలు లేకుండా, విజయశాంతికి తెలంగాణ రాజకీయాల్లో స్ధానం లేకుండా చేయాలనుకున్నారు. అయినా ఎప్పుడూ విజయశాంతి దిగులు చెందలేదు. నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో విజయశాంతికి కీలక భూమిక. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఆమె పోషించిన పాత్ర మరే మహిళా నాయకురాలు పోషించలేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరూ ఆమెకు సాటి రారు. తెలంగాణ రాష్ట్రసాధన కోసం వచ్చింది. తెగించి పోరాటం చేసంది. తెలంగాణ కోసం జరిగిన సుధీర్ఘ పోరాటంలో ఆమె ముందుండి నడిచారు. రాజకీయ పదవుల కోసం ఆమె ఆలోచించలేదు. పదవులు కావాలని కోరలేదు. తన వచ్చిన లక్ష్యం తెలంగాణ ఏర్పాటు. అది పూర్తయింది.. అందులోనూ విజయశాంతి పాత్ర పెద్ద అందరికన్నా పెద్దది. తెలంగాణ బిల్లు రోజున ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలను ఫణంగా పెట్టారనే చెప్పాలి. లోక్‌సభ స్వీకర్ మీరా కుమారి తెలంగాణ బిల్లు చదువుతుంటే ఆ ప్రతులను లాక్కొని చించేయాలని, బిల్లు పాస్ కాకండా చూడాలని ఏపి పార్లమెంటు సభ్యులు ఎంతో ప్రయత్నం చేశారు. ఆ సమయంలో స్పీకర్ పక్కన వుండి బిల్లు ప్రతులు వారికి దక్కకుండా రాములమ్మ చూశారు. ఒక వేళ స్పీకర్ మీద దాడి జరిగే ప్రయత్నాలు జరిగినా అడ్డుకునేందుకు సిద్దంగా వున్నారు. అయినప్పటికీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లి మీరా కుమార్ సృహ తప్పి పడిపోయేలా చేశారు. ఆ సమయంలో విజయశాంతి అక్కడే వున్నారు. ఆమె తృటిలో తప్పించుకున్నారు. అలా తెలంగాణ బిల్లు పాస్ అయ్యేందుకు రాములమ్మ చేసిన తెగింపు తెలంగాణ వున్నంత వరకు మర్చిపోరు. అలాంటి రాములమ్మకు మళ్లీ టైం వచ్చింది. పదేళ్లపాటు ఆమె రాజకీయాలు దూరం కావాల్సి వచ్చినా కాలమనేది ఒకటుంటుంది. అది మళ్లీ త్యాగ ధనులకు మళ్లీ మంచి రోజులు తెస్తుంది. ఇప్పుడు మళ్లీ రాములమ్మకు గుడ్ టైమ్ మళ్లీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. త్వరలోనే మంత్రి కానున్నారు. ఇక రాములమ్మ రంగలోకి దిగితే ఇక బిఆర్‌ఎస్‌కు దబిడిదిబిడే..