రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ లేని కారణంగానే రామాయంపేట అభివృద్ధికి దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రామయంపేట ప్రజలు మేము ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకులు ఇప్పటికైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారని తెలియజేశారు.
రెవెన్యూ డివిజన్ కేంద్రం కనుక ఏర్పడితే మౌలిక వసతులైన బస్ డిపో, డిగ్రీ కాలేజీ , విద్యాలయాలకు నూతన భవనములు వస్తాయి.
అలాగే మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అనగా రెవెన్యూ డివిజన్ కార్యాలయము, డిఎస్పి కార్యాలయము, సబ్ కోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ కార్యాలయము, వీటితోపాటు మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి.
కాబట్టి ప్రజల రాకపోకలు పెరిగి, వాణిజ్య వ్యాపారము పెరుగుతుంది .
అప్పుడే ప్రైవేట్ సెక్టార్ అయినా కంపెనీలు ఇతరత్రా వాణిజ్య సౌకర్యాలు పెరిగి రామాయంపేట అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది కాబట్టి న్యాయమైన కోరిక రామాయంపేట ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించి రామాయంపేట రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అన్నారు.
లేనిపక్షంలో రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గల్లంతు అయ్యేలా కార్యాచరణం తీసుకుంటామని జేఏసీ నాయకులు హెచ్చరించారు .
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.