బాధితురాలికి ప్రభుత్వం న్యాయం చేయాలి
– నిందితున్ని కఠినంగా శిక్షించాలి
పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు తాల్లూరి సౌరిబాబు
పిడుగురాళ్ళ :
అభం శుభం తెలియని మైనర్ బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన అత్యంత దురదృష్టకరమని పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు తాల్లూరి సౌరిబాబు అన్నారు.గురువారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన ఘటన సభ్య సమాజం తల దించుకునే ఘటనని,ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉండి,దారుణంగా ఎనిమిదేళ్ల చిన్నారిపై ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రవర్తించిన తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.నైతిక విలువలు లేని ఇలాంటి వ్యక్తులు సమాజంలో మహిళల భద్రతకు,చిన్నారుల భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు.అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.బాధిత బాలిక కుటుంబానికి ప్రభుత్వం,అధికారులు అన్ని విధాలా ఆదుకోవాలని పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు తాల్లూరి సౌరిబాబు కోరారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షులు వర్ల ఆదాం,ప్రధాన కార్యదర్శి బోడిపూడి షాలేం రాజు,ఆర్గనైజింగ్ సెక్రెటరి ఏసుపోగు యోబు,పబ్లిక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నడికుడి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు…..