పరకాలలో ధర్నాకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు

దొమ్మటి సాంబయ్య కే వరంగల్ పార్లమెంట్ టికెట్ కేటాయించాలని రోడ్డు మీద బైటయింపు

పరకాల నేటిధాత్రి
శనివారం రోజున పరకాల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దొమ్మటి సాంబయ్య కి కేటాయించాలని భారీ ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఎస్సీ విభాగం పరకాల పట్టణ అధ్యక్షుడు బొమ్మ కంటి చంద్రమౌళి మాట్లాడుతూ వరంగల్ పార్లమెంటు పరిధిలో అత్యధిక జనాభా 83 లక్షల జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని తెలంగాణ రాష్ట్రంలో మాల సామాజిక వర్గానికి రెండు సీట్లు కేటాయించారని కాబట్టి దళిత సామాజిక వర్గమైన చిన్న జాతి వారు కాకుండా ఎక్కువ జనాభా కలిగిన మాదిగ జాతి వారికి వరంగల్ పార్లమెంట్ కేటాయించి కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచించి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి దొమ్మటి సాంబయ్య లాంటి వారికి కాకుండా ఇతరులకు ఇస్తే ఊరుకునేది లేదని ఓట్లు చీలిపోయే పరిస్థితి ఉందని,ప్రజా బలం ఒక దొమ్మటీ సాంబయ్యకే ఉందని కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి నాయకుడు సాంబయ్య అని తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం పై ఒత్తిడి చేసి వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కోసం ముఖ్యమంత్రి కృషి చేయాలని అంతేగాక దొమ్మటి సాంబయ్య పార్టీ కోసం ఎంతో పని చేశారని అలాంటివారిని బరిలో దింపితే అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని వెంటనే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ దొమ్మటి సాంబయ్య కె కేటాయించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద రాంచందర్,కౌన్సిలర్ పసుల రమేష్,మాజీ సర్పంచ్ ఇనగాల రమేష్,మాజీ ఎంపీపీ ఒంటెరు రామ్మూర్తి, పరకాల మండల,కాంగ్రెస్ నాయకులు గూడెల్లి సదన్ కుమార్,ఏకు రవికుమార్, బొచ్చు రవి,బొచ్చు మోహన్, కొక్కిరాల తిరుపతిరావు,బొచ్చు భాస్కర్, బొచ్చు అనంత్ ,పల్లెబోయిన శ్రీనివాస్,ఉడుత సంపత్, గోవింద ఉపేందర్,కోడెపాక రాజయ్య,మడికొండ సంపత్, పూరెల్ల సూర్యం,అల్లం రఘు నారాయణ,గోవిందా రవీందర్, చెరుపల్లి మొగిలి,దొమ్మటి మల్లయ్య,బొచ్చు జితేందర్,దొమ్మటి మధు,ఒంటేరు వరుణ్,అల్లం శ్రీ రామ్ దొమ్మటి కృష్ణ కాంత్,గోవిందా ప్రకాష్,గొట్టే రమేష్,ఒంటేరు సదానందం,ఒంటేరు సుధాకర్, ఒంటేరు రవికుమార్,మడికొండ చంగల్,కొయ్యడ రాజేష్ బొచ్చు కుమార్,పసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!