
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
హైద్రాబాద్ తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్స్ పార్టీ బహిరంగ సభకు శనివారం కమలాపూర్ మండలం కాంగ్రెస్స్ పార్టీ నాయకులు,కార్యకర్తలు బారి సంఖ్యలో తరలి వెళ్ళారు.కాంగ్రెస్స్ పార్టీ నాయకులు తౌటం రవీందర్, బాలసాని రమేష్ గౌడ్ ల
ఆధ్వర్యంలో మండల నాయకులు భారీగా తరలివెళ్లారు.పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తో పాటు మల్లికార్జున ఖర్గే లాంటి సీనియర్ నాయకులు పాల్గొననున్న ఈ సభలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను విడులచేసే అవకాశమున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.