
Collector Inspects BC Hostel, Stresses Food Quality
విద్యార్థుల ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ చెక్ చేయాలి
నర్సంపేట బిసి బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శన
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వ వసతి గృహాలో చదువుకునే విద్యార్థులకు అందించే ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాని నర్సంపేట బిసి బాలుర వసతి గృహం అధికారిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. నర్సంపేట పట్టణంలోని బిసి బాలుర వసతి గృహాన్ని మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు.వసతి గృహానికి సంబంధించిన విద్యార్థులు, స్టాఫ్ వివరాలను పలు రికార్డులు, వంటగది, మరుగుదొడ్లను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కామన్ డైట్ మెనూను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పిల్లలకు అందించే ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలని, విద్యార్థులకు మెనూపకారంగా రుచికరమైన నాణ్యమైన వేడి భోజనం అందించాలని అన్నారు. భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాత్రి భోజనం చేశారు.విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే ఏర్పాటుచేసిన కంప్లైంట్ బాక్స్ లో రాసి వేయాలని అన్నారు. విద్యార్థులు హాస్టల్ కు వచ్చి వెళ్ళేటప్పుడు బాధ్యత గా కేర్ టేకర్ వెంట ఉండాలని తెలిపారు.చదువులో వెనుకబడ్డ విద్యార్థులపై వసతి గృహ సంక్షేమ అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సంవత్సరం ప్రభుత్వ బిసి వసతి గృహంలో మెరుగైన ఫలితాలు రావాలని అందుకు విద్యార్థులు కూడా కృషి పట్టుదలతో చదివి జిల్లాలోనే వసతి గృహా విద్యార్థులు ముందంజలో ఉంచి 100 శాతం మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.చదువులో విద్యార్థుల సామర్థ్యం తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు వేసిన కలెక్టర్ పలు సమాధానాలు రాబట్టారు.పదవ తరగతి విద్యార్థులను సబ్జెక్టు వారిగా ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు విషయ పరిజ్ఞానంలో ముందుండాలని సూచించారు. చదువులో వెనుకబడ్డ ప్రతి విద్యార్థిపై వసతి గృహ సంక్షేమ అధికారులు తన సొంత బిడ్డల వల్లే భావించి ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. వసతి గృహ ఆవరణ పరిసరాలు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వసతి గృహ సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన సంక్షేమ అధికారి పుష్పలత, వసతి గృహ సంక్షేమ అధికారి, నాలుగో తరగతి సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.