Grand Lakshmi Narasimha Kalyanam
లోక కళ్యాణార్థం.. శ్రీ కోర్కల్ లక్ష్మీనరసింహుని కళ్యాణం..
ఆలయ చైర్మన్ కర్ర హరిన్ రెడ్డి
వీణవంక,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:
వీణవంక మండల పరిధిలోని కోర్కర్ గ్రామంలో అతి పురాతన వైష్ణవ దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ చైర్మన్ కర్ర హరీన్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. ఉత్సవాలలో భాగంగా మంగళవారం రోజున సుదర్శన యాగం, సామూహిక హోమాలు కన్నుల పండుగ 100 జంటలు హోమాధి కార్యక్రమంలో పాల్గొని, శ్రీ లక్ష్మీనరసింహుని ఆశీర్వచనాలు పొందారు. సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛారణమా, పంచభూతాలు దద్దరిల్లెల, ఆలయ కమిటీ పెద్దల సమక్షంలో, భక్తుల భజన కీర్తన నడుమ పండుగ వాతావరణం లో కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో మహా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కోర్కల్ పరిసర గ్రామాలైన దేశాయిపల్లి, శ్రీరాముల పేట, రెడ్డిపల్లి, కొత్తపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని టెంకాయలు కొట్టి,స్వామివారిని దర్శించుకుని, కుటుంబ సమేతంగా తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ మహోత్సవాలలో ఆలయ చైర్మన్ కర్ర హరిన్ రెడ్డి,వైస్ చైర్మన్ సంఘ సమ్మయ్య,శ్రీధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, ఆలయ కమిటీ పెద్దలు, అమ్మ ఫౌండేషన్ కళా బృందం, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
