బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్ నేత
కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటి ధాత్రి:
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆద్వర్యంలో హైదరాబాదులో ఏర్పాటు చేసిన బిసి మేదావుల సదస్సులో తెలంగాణ బీసీ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం బీసీలకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని,స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను బిసిలకు కేటాయించాలని , ఉద్యోగులకు సీ.పి.యస్. విధానాన్ని తొలగించి ఓ.పి.యస్. తీసుకురావాలని ఉద్యోగులకు ఓ.పీ.యస్. పెన్షన్ సౌకర్యం కల్పించాలని, 317 జి.ఓ. భాదిత ఉద్యోగులకు న్యాయం చేయాలని, కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్, గెస్ట్, మొదలైన ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని,
బిసి ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లను కల్పించాలని, అందుకు అవసరం అయితే రాజ్యాంగం మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, తెలంగాణ బీసీ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, కామారెడ్డి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు చింతల శంకర్, అఖిల పక్ష ప్రజా ప్రతినిధులు ఉద్యోగ ఉపాధ్యాయులు, న్యాయవాదులు, డాక్టర్లు, వివిధ పార్టీల ప్రతినిధుల కుల సంఘాల బాధ్యులు, ప్రజా సంఘాల నేతలు, సమాజ సేవకులు, మీడియా ప్రతినిధులు, మహిళా యువజన విద్యార్థి నేతలు తదితరులు పాల్గొన్నారు.