సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శనివారం చండూరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేసిందని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించి, రకరకాలకారణాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని అన్నారు. రెండు లక్షల రుణమాఫీ అందరికీ మాఫీ చేయాలని, మాఫీ చేసి ఎంతైతే మాఫీ అయిందో తిరిగి అంతా పంట రుణం ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికోరారు.రుణమాఫీకి రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా రుణమాఫీ చేయాలని ఆయన అన్నారు. గృహలక్ష్మీ పథకం కిందమహిళలకు2500 రూపాయలుఇస్తామన్న హామీ ఏమైందనిఆయన ప్రశ్నించారు. 500 రూపాయల గ్యాస్ నేటికీ అమలు కాలేదని, వ్యవసాయ కార్మికులకు నెలకు 1000 వేలు రూపాయల చొప్పున సంవత్సరానికి 12000 వేలు ఇస్తామన్న హామీ ఏమైందనిఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.అన్ని రకాల పింఛన్లుఇచ్చిన మాట ప్రకారంపెంచి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అన్ని పంటలకు మద్దతు ధరలను పెంచికొనుగోలు చేయాలని,కొనుగోలు కేంద్రాలలోమౌలిక వసతులు కల్పించాలనిఆయన అన్నారు.రైతు భరోసానుఅమలు చేయాలని, అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలన్నారు. డిండి ప్రాజెక్టుకు డిపిఆర్ ను ఆమోదించాలని, పర్యావరణ, అడవి శాఖ అనుమతులు ఇవ్వాలని, ప్రాజెక్టుల కు అవసరమయ్యే నిధులనుకేటాయించి, దీని పరిధిలో ఉన్న సింగరాజుపల్లి, గొట్టిముక్కుల, చింతపల్లి,కిష్టారాంపల్లి చర్లగూడెం రిజర్వాయర్ పనులను పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనిఆయన అన్నారు.ఈ కార్యక్రమంలోసిపిఎం జిల్లా కమిటీ సభ్యులుకర్నాటి మల్లేశం, సిపిఎం చండూరు మండల కార్యదర్శిజెర్రిపోతుల ధనుంజయ,సిపిఎం చండూరు మండల కమిటీ సభ్యులు చిట్టిమల్ల లింగయ్య, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.