ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు
చేర్యాల నేటిధాత్రి….
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన యువ వికాసం పథకంలో భాగంగా విద్యా భరోసా కార్డు త్వరగా ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల క్షేమం కోసం ఆలోచించాలని ఏఐఎస్బి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు అన్నారు. ఈ విషయమై పుల్లని వేణు మాట్లాడుతూ…..
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా యువ వికాసం పథకం కింద ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు, ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ ఇంటర్నేషనల్ పాఠశాల ఏర్పాటుచేస్తామని చెప్పడం హర్షనీయం… కానీ అన్ని ఉచిత పథకాల కన్నా మొదట విద్యార్థుల సంక్షేమం కోసం ఆలోచన చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగ,విద్యార్థులు ఓట్లు వేసి గెలిపించారని కాబట్టి వారికి ఇచ్చిన హామీని త్వరగా అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుల కోసం ఆలోచించాలని, అదేవిధంగా హామీ ఇచ్చిన ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుచెయ్యాలని వారు డిమాండ్ చేశారు.