District Collector Urges Speedy Paddy Procurement
వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
నిజాంపేట్, నేటి ధాత్రి
జిల్లాలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్అన్నారు.
శనివారం మెదక్ జిల్లాలోని
నిజాంపేట్ మండలం చెల్మెడ గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్టీవో రమాదేవి తాసిల్దార్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం 2025-26 వానకాలం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, నీడ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు టార్పాలిన్లు, గోనె సంచులు, తూకం యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలని సమకూర్చాలని తెలిపారు. . అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను ప్రతి రోజు సందర్శించాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి వేగవంతం చేయాలని ఆదేశించారు.
