BJP Demands Speedy Paddy Procurement in Sircilla
వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
– బిజెపి పార్టీ పక్షాన వినతి పత్రం అందజేత
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ ని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కురిసిన అకాల వర్షం కారణంగా వరి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసినందున వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా లేదు కాబట్టి రైతులకు టార్పాలిన్ కవర్లను ప్రభుత్వం ద్వారా అందజేయాలని, మ్యాచర్ కండిషన్ లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులకు నష్టం కాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ పక్షాన, బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిలు పొన్నాల తిరుపతి రెడ్డి, సిరికొండ శ్రీనివాస్ కోరారు.
