జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
చిట్యాల, నేటిధాత్రి :
మంగళవారం చిట్యాల మండలం, నైనిపాక బీసీ కాలనీలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే ఫారంను పరిశీలించారు. ఎలాంటి పొరపాటుకు తావులేకుండా తావు లేకుండా కుటుంబాల సమగ్ర సమాచారం నమోదులు చేయాలని సూచించారు. ఈ గ్రామ పరిధిలో 790 గృహాలున్నాయని, వీటిని 5 ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజించి సర్వే చేసేందుకు ఐదుగురు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు కనీసం 20 ఇండ్లకు తగ్గకుండా సర్వే చేయాలని సూచించడమేకాక, సర్వేలో వేగాన్ని పెంచాలని సూచించారు. సర్వే మెటీరియల్‌ను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. సర్వే డేటా ఎంట్రీ కోసం ఆపరేటర్లను నియమించాల్సిందిగా ఆయన సూచించారు. సర్వే ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్ కార్యదర్శి విష్ణు వర్ధన్ ను అభినందించారు. ఇదే ఉత్సాహంతో కేటాయించిన అన్ని ఇండ్లను పకడ్బందీగా సర్వే చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, తహసిల్దార్ హేమ, ఎంపీడీవో జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ, కార్యదర్శి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.