CPM Demands Action on Town Issues
పట్టణంలో పేరుకున్న సమస్యలు పరిష్కరించాలి
ఎస్ఎఫ్ఐ నాయకులు
పరకాల,నేటిధాత్రి
దహదారి పై పండ్ల విక్రయాలు జరపడం వాహనదారులకు,పాదచారులకు ఇబ్బంది ఎదురవుతున్నదని సిపిఎం పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ అంజయ్య కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా సిపిఎం పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన రోడ్లపై మరియు బస్టాండ్ చుట్టుపక్కల పండ్ల బండ్లు ఉండడం వల్ల ప్రయాణికులకు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయని ప్రమాధాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయని వెంటనే పరిష్కారం చూపాలన్నారు.అదేవిధంగా రెండో వార్డులో రోడ్డు మరియు డ్రైనేజీ లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే సమస్యలు పరిష్కరించే చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పరకాల పట్టణ నాయకులు మడికొండ ప్రశాంత్,బొజ్జ హేమంత్ పాల్గొన్నారు.
