
District President Nalgonda Tirupati Gowda
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్
కరీంనగర్, నేటిధాత్రి:
గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకై ఐక్యంగా పోరాడాలని గౌడ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈసందర్భంగా తిరుపతి గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలొ పెట్టిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. యాభై ఏళ్లు దాటిన గీత కార్మికులకి పింఛన్ ఇవ్వాలని, 560జీవో ప్రకారం ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి, ఎక్స్‌గ్రేషియా ఐదు లక్షలు ఉన్నదానిని పది లక్షల రూపాయలకు పెంచాలని, గీత కార్మికులకు రెండు వేల పింఛన్‌ను ఐదు వేలు పెంచాలన్నారు. ప్రతి జిల్లాకు గౌడ భవనం నిర్మిస్తామని నేటికి అమలు చేయలేదని ఆరోపించారు. ప్రతి గ్రామంలో ఈత చెట్టు, తాడిచెట్లు పెట్టి వనాన్ని పెంపొందిస్తామని చెప్పారని హైదరాబాద్ గీత కార్మికుల భవనానికి పూజ చేశారని వెంటనే నిర్మించాలని గీత కార్మికులు అంటే చిన్నచూపు ప్రభుత్వం చూస్తుందని పెండింగ్ లోవున్నా ఎక్స్రిగేసియే బిల్లులు వెంటనే ఇవ్వాలని తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహించే వైన్ షాప్ టెండర్లలో ఇరవై ఐదు శాతం గీతా కార్మికులకే కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని రాబోయే టెండర్లలో ఇవ్వాలన్నారు. గీత కార్మికులు చెట్టు మీద నుంచి పడి శాశ్వత వికలాంగుడు అయితే ఇరవై ఐదు వేలు, గాయాల పాలైతే పదిహేనువేల రూపాయలు బీసీ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం గతంలో ఇచ్చిందని ఇప్పుడు వాటిని ఇవ్వడం లేదని పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని తిరుపతి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.