బిల్డింగ్ రంగు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఏఐటీయూసీ నాయకుడు కుడుదుల వెంకటేష్ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఏఐటియుసి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథులుగా హాజరై బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కుడుదుల వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. జిల్లాలో బిల్డింగ్ రంగంలో పనిచేస్తున్న తాపీ మేస్త్రిలు పెయింటర్లు ఎలక్ట్రిషన్ ప్లంబర్ సెంట్రింగ్ వర్కర్ మార్బుల్ వర్కర్ వెల్డింగ్ వర్కర్ కార్పెంటర్స్ తదితర రంగాలలో పనిచేస్తున్న నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు ప్రస్తుతం భవన నిర్మాణంలో ప్రభుత్వం కడుతున్న ఒక్క శాతం చేస్తున్న రెండు శాతానికి పెంచాలని 60 ఏళ్లు పైబడిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 6000 పెన్షన్ ఇవ్వాలని కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులను రాష్ట్ర స్థాయి సలహా బోర్డులో సభ్యులుగా నియమించాలని గతంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లు ఇతర బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని పాండిచ్చేరి ప్రభుత్వం ఇస్తున్న తరహాలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా రూపాయలు 3000 ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే అడ్డాల వద్ద అన్ని మౌలిక వసతులు ప్రధానంగా షెల్టర్లు మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రమాదంలో మరణించిన భవన నిర్మాణ కార్మికుడికి కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించాలని సహజ మరణానికి ఐదు లక్షల చెల్లించాలని పెళ్లి కానుకకు ఒక లక్ష రూపాయలు చెల్లించాలని పిల్లల చదువులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని వేలు ముద్ర పద్ధతిని తీసివేసి పాత పద్ధతిని కొనసాగించాలని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జయశంకర్ సెంటర్లో అంబేద్కర్ సెంటర్లో రాజీవ్ గాంధీ సెంటర్లో ఈ మూడు అడ్డాల వద్ద షెల్టర్లు కార్మికులు కూర్చోవడానికి నీటి సౌకర్యం కల్పించాలని అర్హులైన భవనిర్మాణ రంగ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో నిర్మాణ కార్మికులకు తొలిప్రే ప్రాధాన్యత కల్పించాలని అన్నారు… శ్రమను నమ్ముకుని నిరంతరం ఆకాశాన్ని అంటే భవనాలను నిర్మిస్తున్నప్పటికీ నిర్మాణ కార్మిక బ్రతుకుల్లో ఏ మాత్రం మార్పు రాలేదని వారిలో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్పు తీసుకురావాలని కోరారు అలాగే భూపాలపల్లి లో పూర్తిస్థాయి అధికారి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ను నియమించాలని వివిధ డిమాండ్లతో కూడిన డిమాండ్ల వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో ఏవో కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చిలకాని రాజయ్య భీముని లక్ష్మీ సమ్మయ్య కోడుపాక లచ్చయ్య కోడిపాక సదయ్య జాడి స్వామి పుల్యాల దేవేందర్ జాడి పోచం దుర్గం బానే దొంతుల పాపయ్య కుమ్మరి పోశం జూకంటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *