అంగన్వాడీల వంట_వార్పు
ఏఐటియూసి జిల్లా ఉపాధ్యక్షుడు దోటి వెంకన్న.
చండూరు సెప్టెంబర్ 25 నేటిదాత్రి: అంగన్వాడీ ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు దోటి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అంగన్వాడీల15 వ రోజు సమ్మె లో బాగంగా చండూరు ఎంఆర్ఓ కార్యలయం ముందు వంటా_వార్పు కార్యక్రమం చేయటం జరిగింది . ఈ సందర్బంగా దోటి వెంకన్న మాట్లాడుతూ 15 రోజులుగా రాష్ర్టంలో ఏఐటీయూసి, సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి లు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. ప్రభుత్వం పోరాటం చేసే సంఘాల తో చర్చలు జరపకుండ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం విచారకరమని అన్నారు.
ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చూపకుండా సమ్మె విచ్చిన్నం చెయ్యాలను కోవటం తగదు అని అన్నారు. బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరు అని అన్నారు.గత 48 ఏళ్లుగా ఐసిడిఎస్ లో గౌరవ వేతనం పేరుతో వెట్టి చాకిరి చేపిస్తూ మహిళల శ్రమ దోపిడీ పాలకులు చేస్తున్నారు. భద్రత లేని బ్రతుకులు చాలి చాలని వేతనము తో ఇంకా ఎన్ని ఏళ్ళు పనిచేయాలి అని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణం ప్రభుత్వం చర్చలు జరిపి హామీలు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. కనీస వేతనము 26వేలు రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్కు పది లక్షలు ఆయాకు ఐదు లక్షలు ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, భీమా వర్తింపజేయాలని, పెండింగ్లో ఉన్న టీఏ డీఏలు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమం లో సిపిఐ మండల సహాయ కార్యదర్శి బొడ్డు వెంకటేశ్వర్లు అంగావాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ శోభ,నిర్మల, నాగమణి,భాగ్యలక్ష్మి, పార్వతమ్మ, రజిని, శారద, హైమావతి, కళ్యాణి, కేదారి,జగదీశ్వరి, సునీత, కృష్ణవేణి,తదితరులు పాల్గొన్నారు.