సీఐటీయూ కు వినతి పత్రం
మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న ఆక్టింగ్ క్లర్క్ ల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏరియాలోని కాసిపేట 2గనిపై సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆక్టింగ్ క్లర్కులు మాట్లాడుతూ, క్లరికల్ ఆక్టింగ్ చేస్తున్న కార్యాలయ సిబ్బంది వివిధ సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని కోరుతూ సిఐటియు ప్రతినిధులకు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. అనంతరం సిఐటియు నాయకులు మాట్లాడుతూ, గతంలో ముందుచూపు లేకుండా ఆక్టింగ్ చేస్తున్న వారిని వన్ టైం సెటిల్మెంట్ కింద పదోన్నతులు కల్పించేలా ఒప్పందం చేసుకోవడంతో క్లరికల్ ఆక్టింగ్ చేస్తున్న సిబ్బంది నేడు నష్టపోతున్నారన్నారు. చివరకు ఆక్టింగ్ చేస్తున్న సిబ్బంది ఆక్టింగ్ క్లర్క్ గా దిగిపోయ్యేవారున్నారని, అదేవిధంగా కార్యాలయాలలో క్లరికల్ ఆక్టింగ్ చేస్తున్న సిబ్బందికి సరైన గుర్తింపు ఇవ్వడం లేదని తెలిపారు. సింగరేణి సంస్థ నియమకాలలో ఆక్టింగ్ క్లర్కులకు ప్రత్యేక అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్, ఉపాధ్యక్షుడు రామగిరి రామస్వామి, నాయకులు అలవాల సంజీవ్, శ్రీధర్, ఆక్టింగ్ క్లరికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.