వసతి గృహాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

హాస్టల్ కు రెగ్యులర్ రాణి వార్డులపై చర్యలు తీసుకోవాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు డిమాండ్ చేశారు
బుదవారం జిల్లా కేంద్రములో ఉన్నటువంటి ఎస్ఎంఎస్ బాయ్స్ హాస్టల్ కమిటీ సమావేశంలో పాల్గొన్నరు సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహల మీద పర్యవేక్షణ లోపం వల్లన్న వసతి గృహాలకు వార్డెన్ లు రెగ్యులర్ గా హాజరు కావటం లేదు అన్నారు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ విద్యారంగ పై దృష్టి సారించడం లో పూర్తి నిర్లక్ష్యం గ ఉంది అన్నారు అదేవిదంగా పెండింగ్ లో ఉన్న మేస్ కస్మోటిక్ ఛార్జీలు విడుదల కావటం లేదు అనే పేరుతో విద్యార్థుల కి మెను ప్రకారం మేస్ అమలు చేయటం లేదు అని వారు అవేదన వ్యక్తం చేశారు అదేవిదంగా విద్యార్థులకు అన్ని రూమ్స్ లో ప్యాండ్లు లైట్స్ ,బూత్ రూమ్స్ సరిగా పనిచేయటం లేదు అన్నారు అదేవిదంగా 10 తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాస్ నిర్వహించటం లో వార్డెన్ లు నిర్లక్యం గా వేవహరిస్తున్నరు అని వారు ఆందోళన వెక్త్తం చేశారు అదేవిదంగా. జనరల్ వసతి గృహంలో ఒక్క రోజు సెలువు వచ్చిన విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు అన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి అని వారు డిమాండ్ చేశారు విద్యారంగం సమస్యల పై పాలు మార్లు కలెక్టర్ కి దృష్టి కి తీసుకెళ్ళి న పట్టించుకోని కలెక్టర్ వారి నిర్లక్ష్య వైఖరి వీడాలి అని వారు డిమాండ్ చేశారు లేని యెడల భారత విద్యార్థీ సమాఖ్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యములో సమరశీల పోరాటాలు నిర్వహిస్తాం అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కమలాకర్ హాస్టల్ కమిటీ సభ్యులు నరేష్ శ్రీకాంత్ రాజేష్ అభిరామ్ శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *