
Bodapatla Rajasekha
గుండెపుడి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి
గుండెపుడి గ్రామంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం మరిపెడ మండల నాయకులు బాణాల రాజన్న, బోడపట్ల రాజశేఖర్ డిమాండ్
మరిపెడ నేటిధాత్రి.
గురువారం మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో నెలకొన్నటువంటి స్థానిక సమస్యలను పరిష్కరించాలని మరిపెడ మండల ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి కి సిపిఎం గుండెపూడి కార్యదర్శి బోడపట్ల రాజశేఖర్ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే దత్తత గ్రామమైన గుండెపుడి గ్రామంలో సమస్యలు నెలకొన్నాయని, వీధిలైట్లు మురికి కాలువలు సరిగ్గా పనిచేయడం లేదని గ్రామంలో మూడు మంచినీటి బావులు ఉన్నా కూడా నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు, ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షాలకు ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిని వాహనదారులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతునరాని, మురికి కాలువలో ఉన్న చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు పెరిగి విష జ్వరాలు పెరిగి ప్రజల అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామంలో తక్షణమే గ్రామ కార్యదర్శిని నియమించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి షేక్ షరీఫ్ బయ్య సురేష్, కందాల రమేష్ ఎల్లయ్య నారాయణ,అలీ శ్రీనివాస్ రెడ్డి గణేష్, సురేషు, రామ్మూర్తి, ఈమన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు