
-ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
చిరు వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
డ్రైనేజీ,పారిశుద్ధ పనుల మీద అసంతృప్తి
పరకాలను అభివృద్ధి చేసి నగర స్థాయిలో నిలుపుతా
పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని పలు వీధుల్లో కాలనీలలో పరకాల మున్సిపల్ కమిషనర్,ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పలుకాలనీలల్లో,విధుల్లో పర్యటించారు.గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే పట్టణం అభివృద్ధి కి నోచుకోలేదని అన్నారు.అనంతరం కూరగాయల మార్కెట్ మీదుగా కోర్టు నుండి పర్యటన ప్రారంభించి కొత్త మార్కెట్ బిల్డింగ్,దామర చెరువు మినీ ట్యాంకుబండు ను పరిశీలించారు.కుంకుమేశ్వర దేవాలయం వద్ద ఆటో స్టాండ్, బస్టాండ్ వద్ద చిరు వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి బస్టాండ్ మీదుగా డిపో వరకు సైడ్ డ్రైన్,లలితాదేవి హాస్పిటల్ వద్ద కల్వర్టు,శ్రీనివాస కాలనీలోని బ్రిడ్జి నిర్మాణ పనులు,మొగళ్ళపల్లి క్రాస్ డిపో దగ్గర రోడ్డు విస్తరణ పనులను, రాజధాని టీ హోటల్ నుండి కనపర్తి రోడ్డును పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ దగ్గర,పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ సమస్య మరియు మురుగునీరు సమస్యను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల మార్కెట్ రోడ్డు, ఆంధ్రాబ్యాంక్,సి ఎం ఎస్ రోడ్డు,పాత పోస్టుమార్టన్ వద్ద స్థలం,కనకదుర్గమ్మ గుడి వద్ద ఉన్న కల్వర్టు,ఎమ్మారెడ్డి కాలేజీ ఎదురుగా డ్రైనేజీలను ఎమ్మెల్యే పరిశీలించారు. దామర చెరువు పనులు,పారిశుధ్య పనుల పై అసంపూర్తికి వ్యక్తం చేశారు.ఈ సమస్యలను మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి వెంటనే సమస్యలను పరిష్కరించాలని అక్కడికక్కడే ఆదేశించారు. పరిష్కారానికి నా వంతుగా సహకారం ఏదైనా ఉంటే నేరుగా చెప్పాని అన్నారు.అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారంతో పరకాల పట్టణంలోని ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధిలో నగర స్థాయిలో పరకాల నిలిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తాను రాజకీయాలకతీతంగా సామాజిక బాధ్యతగా పనిచేస్తానని పట్టణ అభివృద్ధికి ప్రజలు వివిధ పార్టీల నాయకులు అధికారులు తనకు సహకరించాలని కోరారు.పరకాల పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల, అధికారుల సహకారంతో ముందుకు వెళ్తానని అందుకు ఈనెల ఏడవ తేదీన రెవెన్యూ, ఇరిగేషన్,మున్సిపాలిటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పట్టణ అభివృద్ధి చేస్తా చేస్తాననిఅన్నారు. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.