పట్టణంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలి
బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతిపత్రం
త్వరగతిన పరిష్కార చర్యలు తీసుకోవాలి-పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్
పరకాల నేటిధాత్రి
మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ వాహనాలు (ఆటోలు , ట్రాక్టర్)రావడం లేదని వార్డులలో పారిశుద్య పనులు సక్రమంగా జరగండం లేదని,చెత్త చెదారంతో మురుగు నీటితో కాలువలు నిండి పట్టణ ప్రజలు దోమల బారిన పడటం వలన అనేక సమస్యలు ఎదురుకుంటున్నారని
మున్సిపాలిటీలో సిబ్బంది ఉండి కూడా అధికారుల నిర్లక్ష్యం వలన పట్టణం సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని,అలాగే పట్టణంలో సంవత్సరాలుగా నీటి కొరత ఉందని,వేసవి కాలంలో పట్టణ ప్రజలకు ఎలాంటి నీటి కొరత లేకుండా ముందు జాగ్రత్త వహించాలనిపరకాల పట్టణంలో పారిశుద్ధ్యము,నీటి సరఫరా సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ కు బిజెపి పట్టణ శాఖ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ మాట్లాడుతూ సమస్యలకు త్వరగతిన పరిష్కారం చూపాలని ఎప్పటికప్పుడు సిబ్బంది పానీతిరును పర్యవేక్షిస్తూ పనులు జరిపించాలని లేదంటే ప్రజలతో ఏకమై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో 9 వార్డు మాజీ కౌన్సిలర్ పూర్ణచారి,మార్త బిక్షపతి,కుక్కల విజయ్ కుమార్,సంగా పురుషోత్తం, బూత్ అధ్యక్షులు దామ సతీష్,ముత్యాల దేవేందర్, సారంగ నరేష్,ఉడుత చిరంజీవి,పల్లెబోయిన భద్రయ్య,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.