పాఠశాల ఆవరణలో ప్లాస్టిక్ కవర్ల పొగ పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లోని హుజురాబాద్ రోడ్ బిట్స్ పాఠశాల ఎదురుగా కుప్పలు కుప్పలుగా చెత్త పోయడం దానిని మునిసిపాలిటీ సిబ్బంది తగులబెట్టడం వల్ల పాఠశాల విద్యార్థిని విద్యార్థులుఆ పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అసలు పాఠశాల ఎదురుగా చెత్త పోసేది ఎవరు ఒకవేళ పాఠశాల వాళ్లే అయితే మునిసిపల్ సిబ్బంది ఏం చేస్తున్నారు. పట్టణం అవతల పోయాల్సిన చెత్త మరుగున పడుతుంటే శానిటేషన్ శాఖ వాళ్ళు ఎందుకు పట్టించుకోకుండా ఉంటున్నారు.ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు,చెత్త కాలబెట్టడం వల్ల వచ్చే వాయువు లు పాఠశాల లోని చిన్న పిల్లలు అస్వస్థతకు గురి అయ్యే ప్రమాదం ఉంది. అది కాకుండా పక్కనే పెట్రోల్ బంక్ ఉన్నది. ఇది ఇంకా చాలా ప్రమాదం అని తెలిసినా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వెంటనే పాఠశాల ఎదురుగా చెత్త పోయకుండా మునిసిపల్ సిబ్బంది చూడాలని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.