
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని జి శివాని ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడోత్సవంలో పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ బిక్షపతి తెలిపారు, అలాగే 28, 10 ,2024 రోజున పెద్దపెల్లి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడలో జయశంకర్ జిల్లా తరఫున పాల్గొనడం జరుగుతుందని తెలిపారు, రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని శివానికి కళాశాల ప్రిన్సిపల్ బిక్షపతి డీఈవో రాజేందర్ పిఈటి, మరియు పిడి, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించడం జరిగింది