
Construction Workers Demand Sand Price Reduction
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక ధర తగ్గించాలి
సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు తెలంగాణ బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి పిలుపు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం యూనియన్ అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు గారి అధ్యక్షతన బి.వై. నగర్ లోని కామ్రేడ్.. అమృత్ లాల్ శుక్లా కార్మిక భవన్ లో జరిగింది ఇట్టి సమావేశంలో జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇసుక , మొరం ,మట్టి కొరత మరియు భాను నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీం లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం అప్పజెప్పడం ద్వారా భువన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు జరిగే నష్టాలను చర్చించి జిల్లాలో స్థానిక సమస్యలపై ఆగస్టు 25వ తేదీ సోమవారం రోజున ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగినది.ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మండ్ల నిర్మాణానికి సంబంధించి ఇసుక మొరం మట్టి కొరత వలన నిర్మాణ మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతోపాటు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అదేవిధంగా భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రభుత్వము ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని దీనివలన జిల్లాలో భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు.జిల్లాలో స్థానికంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 25వ తేదీ సోమవారం రోజున ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇట్టి ధర్నాలో జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులు అదేవిధంగా నిర్మాణరంగంలో పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇట్టి సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాపేల్లి రమేష్ , కోల శ్రీనివాస్ , ఈసంపేల్లి రాజెలయ్య , గుంటుక నరేందర్ , సావన పెల్లి ప్రభాకర్ , భూక్య వెంకట్ , దేవయ్య , శంకర్ , చంద్రయ్య , మల్లేశం తదితరులు పాల్గొన్నారు.