
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా ప్రభుత్వ
పాఠశాలలో పేద విద్యార్థులకు ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి ఆధ్వర్యంలో ప్యాడ్స్ పెన్నులు పంపిణీ చేశారు.అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం మరియు ప్రజా సంక్షేమ వేదిక నాయకులు విద్యార్థులకు పరీక్ష వ్రాసే విధానం గురించి వివరించారు.పట్టుదలతో చదువు కోవాలని తల్లి తండ్రుల ఆశయాలు నెరవేర్చలని అన్నారు.విద్యార్థి దశనుండే సామాజిక సేవా భావం అలవార్చుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమం లో ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి,ప్రధానోపాధ్యాయులు రమేష్,వాణి,సుధాకర్ రావు,పాఠశాల అధ్యాపకులు, ట్రైని ఉపాధ్యాయులు,ప్రజా సంక్షేమ వేదిక నాయకులు శిరీష,కిరణ్ కుమార్,శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.