
Education
ప్రభుత్వ పాఠశాలల సత్తా….
8 పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత
మండల టాపర్ ఎల్లారెడ్డి
నేటి ధాత్రి:
ఝరాసంగం: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ
తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం లోని, బర్దిపూర్, ఎల్గోయ్, జీర్లపల్లి, ఈదులపల్లి, ఝ రాసంగం, ఆదర్శ పాఠశాల, కేజీబీవీ, మహాత్మ జ్యోతి రావు పూలే పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. కుప్పానగర్ పాఠశాలలో 99% శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మండల వ్యాప్తంగా 402 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 401 మంది ఉత్తీర్ణత సాధించారు. కుప్పానగర్ పాఠశాలకు చెందిన ఒక్క విద్యార్థి మాత్రమే ఉత్తీర్ణత సాధించలేకపోయారు.

మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థి ఎల్లారెడ్డికి 581 మార్కులు సాధించి మండల టాపర్గా గెలిచాడు. తెలంగాణ మోడల్ స్కూల్కు చెందిన ఎస్. రాధిక 574 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. మండ లానికి చెందిన 30 మందికి పైగా విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. జడ్పీహెచ్ ఎస్ ఝరాసంగం పాఠశాలకు చెందిన రాహుల్ 556, సీహెచ్. భవాని 548, జి. భువనేశ్వరి 529, కె. త్రిష 527, ఎలిజబెల్ రాణి 526 మార్కులు సా ధిం చారు. ఈ విద్యార్థులను మండల విద్యాధి కారి శ్రీనివాస్, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు.