
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని హరిహర ఇటుక బట్టీలో ఒరిస్సా రాష్ట్రంలోని రికిమాల తాలూకా దొమ్మేరువార్(వి) గ్రామానికి చెందిన మహిళ బాలికా రౌత్ భర్త మురళి రౌత్ తో వచ్చి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో ఇటుక బట్టీల వద్ద వారు ఏర్పరచుకున్నటువంటి నివాసం నుంచి 12పిబ్రవరి2024 రోజున రాత్రి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆతర్వాత ఎంత వెతికిన ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. తప్పిపోయిన ఈమె వయసు నలబై సం.లు, గుండ్రని ముఖం, 4.8ఎత్తు కలదని ఆచూకీ లబించినట్లైతే 8712670767, 8331940651, 7683886773, 9299992256 గల నంబర్లకు సమాచారం ఇవ్వగలరని, ఆమె భర్త పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామడుగు ఎస్సై రమేష్ గౌడ్ తెలిపారు.