నిరుద్యోగులకు అండగా కదం దొక్కిన విద్యార్థి సంఘ నాయకులు
వీణవంక, ( కరీంనగర్ జిల్లా)
నేటి ధాత్రి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ వన్ పోస్టుల 1:100 ప్రకారం నిర్వహించాలని. గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచి రీ నోటిఫికేషన్ నిర్వహించాలని డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని పోస్టుల సంఖ్యను పెంచాలని ఈరోజు హైదరాబాదులోని టీజీపీఎస్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన విద్యార్థి సంఘ నాయకులను వీణవంక ఎస్సై తోట తిరుపతి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ… నిర్బంధాలతో నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తున్న ఉద్యమాలను అణచలేరని కలబోలి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. లేనియెడల రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు మేధావులు అందరిని ఏకం చేసుకుని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ నిర్వహిస్తామని అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల హక్కుల సాధనకై పోరాటాలు చేస్తుంటే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుంటే కనీసం పట్టించుకోకుండా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను,ఎమ్మెల్సీలను కొనుగోలుపై శ్రద్ధ సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు మీ పాలన ఇలానే కొనసాగితే భవిష్యత్తులో మీ ఉద్యోగాలు ఊడదీసే దాకా నిరుద్యోగులు నిద్రపోరని హెచ్చరించడం జరిగింది. బి ఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు ఆవుల తిరుపతి యాదవ్,అప్పని హరీష్ వర్మ , రాపర్తి అఖిల్ గౌడ్ పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ లను అరెస్టు చేయడం జరిగింది.