రోజనాల శ్రీనివాసులు సత్కరించిన మీడియా మిత్రులు
నేటిధాత్రి హనుమకొండ
నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రోజనాల శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పిఐబి నిర్వహించిన ప్రెస్ టూర్ విజయవంతం ఐయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన్ను బుధవారం dpro, జర్నలిస్ట్ లు డీపీ ఆర్వో కార్యాలయం లో సత్కరించారు.
ఈ సందర్బంగా dpro లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రెస్ టూర్లు జర్నలిస్ట్ ల వృత్తి నైపుణ్యం మెరుగు పడుతుంది అని అన్నారు. ఇలాంటి ప్రెస్ టూర్లు ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువు అవుతాయి అని అన్నారు.
రోజనాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రెస్ టూర్ లోపీఐబీ కార్యాలయంతో పాటు మహారాష్ట్ర సచివాలయం, రాజ్ భవన్, సెంట్రల్ రైల్వే, కొంకణ్ రైల్వే కార్యాలయాలతో పాటు అర్బిఐ, బిఎస్ఈ, ఎన్ఎస్ఈ,స్వయంపూర్ణ గోవా మిషన్ పథకాల పరిశీలన, డిజటల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కున్బీ చీరల తయారీ కేంద్రం, పనాజీ వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రాజెక్ట్, రోడ్ల విస్తరణ కార్యక్రమాలను పరిశీలించండం జరిగింది అని అన్నారు.పిఐబి అధికారులు డా మానస్ కృష్ణ కాంత్, శివచరణ్ రెడ్డి గౌతమ్,మహేశ్వరం మహేంద్ర, తోటి జర్నలిస్ట్ లు సహకరించారు అని అన్నారు.
ఈ కార్యక్రమం లో సీనియర్ జర్నలిస్ట్లు తోట సుధాకర్,నల్లాల బుచ్చిరెడ్డి, కంకణాల సంతోష్, అంతడుపుల శ్రీనివాస్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.