డీఎస్పీ మండల కన్వీన ర్ కుర్రి స్వామినాథన్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో మంగళవారం రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి
ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గణపురం మండల తహాసిల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎం ఆర్ ఓ మధురకవి సత్యనారాయణ స్వామి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ కుర్రి స్వామినాదన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది ప్రజలకు విద్యా వైద్యం ఉపాధి ఇల్లు భూమి ఈ ఐదు సమస్యలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు 5 ఐదు డిమాండ్లను ఉంచుతున్నట్లు తెలిపారు.
1) ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలి.
2) ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రతి గ్రామంలో ఆధునిక ఆసుపత్రిని నిర్మించాలి.
3) ప్రజలందరికీ ఉపాధిని కల్పించాలి.
4)అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యం ఉన్న ఎకరం భూమిని ఇవ్వాలి.
5) అర్హులైన వారందరికీ 200 వందల గజాలు నాలుగు గదులు ఇల్లు నిర