తహసిల్దార్ నాగరాజు ఎదుట బైండోవర్…
నడికూడ,నేటిధాత్రి: మండలంలోని సర్వాపూర్ గ్రామానికి చెందిన సున్నపు రాజేందర్ తండ్రి పేరు శంభు లింగం వయస్సు 34 గ్రామ శివారులో ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారుచేసి చుట్టు పక్కల గ్రామాలకు తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు గురువారం రాత్రి పరకాల ఎక్సైజ్ సీఐ తాతాజీ ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎస్సై సులోచన,ఎక్సైజ్ కానిస్టేబుల్స్ బృందంతో కలిసి శాయంపేట మండలం గట్ల కనపర్తి గ్రామంలో గుడుంబా తరలిస్తున్న రాజేందర్ ను పట్టుకోవడం జరిగింది. శుక్రవారం నడికూడ మండల తహసిల్దార్ నాగరాజు ఎదుట సున్నపు రాజేందర్ ను బైండోవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారు చేసిన అమ్మిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని బైండోవర్ చేసిన అనంతరం మళ్లీ గుడుంబా తయారు చేస్తే వారు కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని అన్నారు.