బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

– వ్యక్తిపై కేసు నమోదు, రిమాండ్ కు తరలింపు
– మోసపోయిన బాధితులు సబంధిత పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేయాలి
– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి):
మోసపూరిత మాటలతో కబ్జాలో లేని భూమి అమ్మి రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు రిమాండ్ కు తరలింపు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి విజయ కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కోనరావుపేట పోలీసులు విచారణ చేపట్టగా, ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన మంత్రి రఘు అను వ్యక్తి 2022 వ సంవత్సరంలో కోనరావుపేట మండల కేంద్రంలో తన కబ్జాలో లేని భూమిని తనదిగా నమ్మించి, మోసపూరితంగా కొంపల్లి విజయ అను మహిళా నుండి 20 లక్షల రూపాయలు తీసుకోని, ఎక్కడ కూడా కబ్జాలో లేని 24 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసి, తదుపరి భూమి హద్దుల విషయమై అడుగగా తప్పిoచుకొని తిరుగుతున్నాడు, ఇటీవల కలిసి సదరు కొంపల్లి విజయ తన ఆర్థిక ఇబ్బందుల గురించి రఘుకు తెలియజేసి తనను మోసం చేయవద్దని, తనకు భూమి లేదా తన డబ్బులు తనకు తిరిగి ఇచ్చివేయాలని బ్రతిమీలాడగా, మరొక లక్ష రూపాయలు ఇస్తేనే కబ్జా విషయంలో సహకరిస్తానని తెలిపి , ఇటీవల అదనంగా మరొక లక్ష రూపాయలు బలవంతంగా వసూలు చేసి, భూమి హద్దుల విషయమై మరలా అడుగగా తాను మాజీ నక్సలైట్ అని, మరొకసారి డబ్బుల విషయమై ఇబ్బందులకు గురిచేస్తే చంపివేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్న మంత్రి రఘు అనే వ్యక్తిని కోనరావుపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినారు,ఇందుకు సహకరించిన ఇతర వ్యక్తులపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నదాని, మంత్రి రఘు తన కబ్జాలో లేని భూములను అమాయక ప్రజలకు అమ్మి రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్న మంత్రి రఘు చేతిలో మోసపోయిన బాధితులు సంబంధించిన పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *