నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజల అయోమయం.
తంగళ్ళపల్లి,నేటిధాత్రి:
మండలంలో ఆయా పార్టీల నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజలు అయోమయానికి గురైతున్నారు.తంగళ్ళపల్లి మండలంలో ఒక వైపు బిఆర్ఎస్ నాయకులు మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లతో ప్రజలు అయోమయానికి లోనవుతూ మండలంలో ఏం జరుగుతుందో తెలియక గందరగోళ పరిస్థితిని నెలకొన్నది. నువ్వా నేనా అంటూ బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లో వ్యక్తిగతంగా చేసుకుంటున్నారనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నేతల ఆరోపణలు, అలాగే బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపణలు మండలంలో నువ్వా నేనా అన్న చందంగా తయారైందని చర్చలు జరుగుతున్నాయి.అధికారంలో ఎవరున్నా మండలాన్ని అభివృద్ధి చేయాలే తప్పా వ్యక్తిగత దూషణలతో
మాట్లాడుకోవడం సరైంది కాదని మండల ప్రజలు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా ఎకరిపై ఒకరు దుషించుకోకుండా సమన్వయంతో ఉంటూ మండల అభివృద్ధికి దోహద పడాలని పలువురు మండల మేధావులు,ప్రజా సంఘాల నాయకులు,ప్రజలు కోరుతున్నారు.