కాలనిలో దుర్వాసన వల్ల ప్రజల ఇబ్బందులు
పరకాల నీటిధాత్రి
పరకాల పట్టణంలోని స్థానిక 13వ వార్డులో లైన్స్ క్లబ్ స్మశాన కైలాస రధం నడిపే డ్రైవర్ గా పనిచేసే అమ్మాయి గత నెల రోజుల కిందట ఇల్లు నిర్మించుకోవడం జరిగింది.దానికి పర్మిషన్ కూడా లేకుండా స్మశాన వాటికి పెట్టెలు ఆ ఇంటిలో నిలువ చేయడం జరుగుతున్నదని వాటి వలన వాడలో దుర్వసన,రక్తంతో వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చిన్నపిల్లలు ఆరోగ్యాల పాలు అవుతున్నారని దీని ద్వారా ఆ వాసనతో వీధి కుక్కలు రాత్రంతా ఇండ్లలో సంచరించడం వల్ల ఇబ్బంది పడుతున్నమన్నారని 13వ వార్డు ప్రజలు స్థానిక కమిషనర్ శేషంజనస్వామి కి వినతిపత్రం అందజేయడం జరిగింది.అక్కడనుండి వాహనాలను తొలగించాలని కాలనివాసులు కోరారు.ఈ కార్యక్రమంలో ఏకెల్లీ కుమారస్వామి,మడికొండ రవీందర్,మడికొండ జయరాజ్,బొచ్చు అశోక్, ఒంటెరు ప్రభాకర్,మడికొండ చంగల్,బొమ్మకంటి చంద్రమౌళి,బొచ్చు సదానందం,బొచ్చు రవి, ఒంటేరు మంజుల లక్ష్మణ్, జీవన్ రాజయ్య,మడికొండ సుధాకర్,లంకదాసరి భాస్కర్, అధిక సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.