వేములవాడ, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన సుమారు 100మంది ఎస్సి(మాదిగ) సంఘం సభ్యులు సోమవారం రోజున బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా కాలనీలో ఎస్సి కుల సంఘ భవనం పెండింగ్ లో ఉందని, ఇంకా కొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని సంఘం సభ్యులు చల్మెడ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన చల్మెడ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన వెంటనే అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ అరుణ-రాఘవ రెడ్డి, సర్పంచ్ రేగులపాటి ఉమా రాణి, వైస్ ఎంపీపీ రవి చందర్ రావు, సెస్ డైరెక్టర్ హరి చరణ్ రావు, నాయకులు బూర బాబు తదితరులు పాల్గొన్నారు.