*సౌభ్రాతృత్వం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
*దేశం కోసం, ప్రజల కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం;
*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ గల పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ పరామర్శ విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్ ఫ్లాగ్ డే ను జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
అమరుల త్యాగాలు, ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలని,దేశం కోసం, దేశ ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన పోలీస్ అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అన్నారు.
చందుర్తి మండలం లింగంపెట గ్రామ శివారులో గల అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ , అదనపు ఎస్పీ చంద్రయ్య, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజావసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణ తో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు.శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు జాతీయ ఐక్యత కోసం ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని ,ఇది అభినందనీయమని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
అక్టోబర్ 21,1959 సంవత్సరం లో CRPF ఎస్.ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మంది భారత జవాన్లు కలసి లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన వారి పై దాడి చేసి 10 మందిని హతమార్చినదన్నారు. అప్పటి నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణ లో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్-21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా ప్రభుత్వం పాటిస్తుందన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంను పోలీస్ ఫ్లాగ్ డే గా జరుపుకుంటున్నాం అని,పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుంది, ఈ సమాజం కోరుకునేది శాంతి, స్థిరత్వం,అభివృద్ధి.పోలీస్ శాఖ వారి త్యాగాల ద్వారా ఎన్నో దశాబ్దాలుగా భౌతిక రక్షణ నుండి, సామాజిక రుగ్మతలను పారద్రోలడం వరకు పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యదీక్షతో , సేవాతత్పరత తో పని చేస్తుందన్నారు.విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ క్రమం తప్పకుండా ప్రతి ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణార్థం పోలీస్ ఫ్లాగ్ డే ను ఘనంగా నిర్వహిస్తోందన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో 08 మందికి పైగా పోలీసులు అసువులు బాసారని అన్నారు.వారి త్యాగ ఫలం వల్లే గతం కంటే ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు.పోలీస్ ల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు.ఇట్టి కార్యక్రమానికి అమరులైన కుటుంబాలకు సంబందించిన కుటుంబ సభ్యులు హాజరై నివాళ్ళు అర్పించడం జరిగింది. కలెక్టర్,ఎస్పిలు త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థుతులు వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తాం అని తెలిపారు.అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు.
ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా తీవ్రవాదులు,సంఘ విద్రోహక శక్తుల్లో 189 మంది పోలీసులు అమరులయ్యారనీ అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ
వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని మరియు వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను సర్వస్వం లభింపచేయడం,అయా కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమర వీరులకు మనం అందించే నిజమైన నివాళి అన్నారు.
అసాంఘిక శక్తులతో పోరాడుతూ , కార్యనిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బందికి పేరు పేరునా నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ సంక్షేమ౦ చూడడం,వారికి ఆర్థిక పరమైన ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందచేసి వారికి మానసిక బలం చేకూర్చడమే పోలీసుల అమరవీరులకు మనం అందించే నిజమైన నివాళి. తామరగి మనకు, మన సమాజానికి శాంతిని స్థిరత్వాన్ని అభివృద్ధిని అందించిన మన సోదరులకు మరో మారు అమర వీరులు అయిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31వ తేదీ జాతీయ ఐక్యత దినోత్సవం వరకు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో డిఎస్పీ లు నాగేంద్రచరి, రవికుమార్, సి.ఐ లు కిరణ్ కుమార్, కరుణాకర్,కృష్ణకుమార్,ఉపేందర్,సదన్ కుమార్, శశిధర్ రెడ్డి,ఆర్.ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్, ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, అమరవిరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.