
"Bhanu Vows to Strengthen Congress in Mangapet"
పార్టీ మరింత బలోపితం కావడానికి కృషి చేస్తా
కాంగ్రెస్ పార్టీ కమలాపురం గ్రామ మహిళా ప్రధాన కార్యదర్శి భాను
మంగపేట, నేటిధాత్రి :
కమలాపురం గ్రామంతో పాటు మంగపేట మండలంలో పార్టీ మరింత బలోపితం కావడానికి తన వంతు కృషి చేస్తానని కమలాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి వడ్లకొండ భాను అన్నారు. మంగళవారం మండలంలో స్థానిక విలేకరులతో వడ్లకొండ భాను మాట్లాడుతూ తనను కమలాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన ప్రియతమ నాయకురాలు, రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి దనసరి అనసూయ ( సీతక్క )కు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ , ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు ముద్దాలి నాగమణి, కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు శానం నిర్మల, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి లతో పాటు నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న పార్టీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులకు, మండల సీనియర్ నాయకులకు, గ్రామ సీనియర్ నాయకులకు, కమలాపురం గ్రామ కమిటీకి, మహిళా నాయకురాళ్లకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతీ ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని వడ్లకొండ భాను అన్నారు. తనపై నమ్మకంతో కమలాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకుల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి పార్టీ నేతల సహకారంతో, ప్రతి కార్యకర్తతో ఐక్యంగా ముందుకు సాగుతూ అంకితభావంతో నిబద్ధతతో పని చేస్తానని వడ్లకొండ భాను తెలిపారు.