జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పంచాయతీ కార్యదర్శులు గ్రామస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం రోజున ఎంపీడీవో మరియు ఎంపీవో కి వినతి పత్రం అందజేశారు. పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే టార్గెట్లు పెట్టడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని అలాగే ఇతర శాఖల పనులు కూడా తమతో చేపించడం వలన పని భారం పెరిగి పని ఒత్తిడి కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించాలని పై అధికారులకు విన్నవించుకున్నారు.