"Padmashali Community Vanabhojanam Invitation"
కార్తీక మాస మన భోజనానికి పద్మశాలి కులస్తులు తరలిరావాలి
పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు వనం సత్యనారాయణ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధారి వనంలో నేడు జరిగే కార్తీక మాస వనభోజనాల కార్యక్రమానికి పద్మశాలి సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు వనం సత్యనారాయణ కోరారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు వనం సత్యనారాయణ మాట్లాడారు. వనభోజనం సందర్భంగా ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సాంస్కృతిక కార్యక్రమాలు పాటల పోటీలు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పద్మశాలి సంఘ సభ్యులు కుటుంబ సమేతంగా వచ్చి వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఆడేపు తిరుపతి, సంయుక్త కార్యదర్శి వేముల అశోక్, ఆర్గనైజర్ సెక్రటరీ కొండ కుమార్, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆడెపు లక్ష్మణ్, సంతోష్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.
