సంస్థ గత ఎన్నికల నిర్మాణ సన్నాహాగా సమావేశం సంస్కృత నిర్మాణం వైపు కాంగ్రెస్ అడుగులు రిజర్వేషన్ ఏదైనా కలిసికట్టుగా పని చేద్దాం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
మండలంలో జరిగిన సమావేశంలో రిజర్వేషన్ ఏదైనా కలిసికట్టుగా పని చేద్దాం గ్రామ కమిటీలను పటిష్టం చేయడం మనందరి బాధ్యత అని భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మొగుళ్లపల్లి లోని అమ్మ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సంస్థాగత నిర్మాణ సన్నాహాక సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్రసత్యనారాయణ రావు తోపాటు సంస్థాగత నిర్మాణ సన్నాహక పరిశీలకులుగా ఇనుగాల వెంకటరామిరెడ్డి, లింగాజీ పాల్గొనగా. సభాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అయితే ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ. మొగులపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఈ నెల 15 నుండి 17 వరకు అన్ని గ్రామాల ప్రజలు కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని గ్రామ కమిటీలను ఎన్నుకునే విధంగా ఇన్చార్జిలు బాధ్యత తీసుకోవాలని కమిటీలను వేయడం పూర్తి చేయాలని గ్రామ కమిటీలు పటిష్టంగా ఉంటే పార్టీ పటిష్టంగా ఉంటుందని గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మండలంలో 25 మంది సర్పంచుల 25 మంది ఉపసర్పంచ్లు 300 మంది వార్డు సభ్యులను ఒక ఎంపీపీ ఒక జడ్పిటిసి 13 మంది డైరెక్టర్లకు అర్హులైన వారిని ఎంపిక చేయాలని. రిజర్వేషన్ ఏది వచ్చిన ఆ గ్రామాలలో నాయకత్వం వహించి నాయకుడు బాధ్యత వహించి గ్రామ ప్రజలు నిచ్చే వ్యక్తిని సర్పంచ్ గా ఎంపిటిసిగా జడ్పిటిసిగా డైరెక్టర్లుగా ఎంచుకొనె బాధ్యత తీసుకోవాల్సిందిగా సూచించారు మీ గ్రామాల్లో అభివృద్ధి కొరకు గ్రామ కమిటీలు ఒక్కటిగా కూర్చుని చర్చించి తీర్మానం చేసుకుని గ్రామ కమిటీ అధ్యక్షుడు వస్తే తప్పకుండా ఆ పనిని చేయడం జరుగుతుందని ఎవరు పడితే వారు రావద్దని కార్యకర్తలకు సూచించారు.

ఎవరు పడితే వారు తమ ఇష్టంగా నా పని కావాలంటే మీ పదవులు ఉండవని ఎమ్మెల్యే వారికి తెలిపారు ప్రజల కోసం ఇచ్చిన పదవులను ప్రజలు మెచ్చే విధంగా పనిచేయడం అని ఇందిరమ్మ పిల్ల జాబితా అర్హులకు అందే విధంగా చూసుకోవాలని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనమందరం యుద్ధ సైనికుల పని చేసేందుకు పటిష్టమైన కార్యకర్తలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ సమావేశంలో. పరిశీలకులు ఇనుగాల వెంకటరామిరెడ్డి, లింగాజి, పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, చిట్యాల ఏఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ సంపెళ్లి నరసింగారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి, జిల్లా నాయకులు మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు