ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల కోశాధికారి వాగబోయిన రవీందర్ ఏర్పాటుచేసిన సమావేశంలో, ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షులు పూనేం రమణబాబు మాట్లాడుతూ షెడ్యూల్డ్ ప్రాంతమైనటువంటి గుండాల మండలంలో 1/70 చట్టం అమల్లో ఉన్నా కూడా విచ్చలవిడిగా బహుళంతోస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. తెలంగాణ గ్రామ పంచాయతీ భూ అభివృద్ధి లేఅవుట్ మరియు భవనంల నిబంధనలు 2002 అమల్లో ఉన్నా భవన నిర్మాణదారులపై ఎటువంటి చర్యలు అధికారులు తీసుకోలేదు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలపై గత కొద్ది కాలంలో పిఓ ఇచ్చిన షోకాస్ నోటీసుల ఉత్తర్వులను అమలు చేసి నిర్మాణదారులపై సుమోటో మరియు యల్ టీఆర్ కేసులు నమోదు చేయాలని దానికి సహకరించిన అధికార యంత్రాంగం పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పూనేం వసంత్, గోగ్గేల సుధాకర్,నరసింహారావు, సుదర్శన్,సందీప్, నాగరాజ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.