*కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రావరం ఎంపీటీసీ గాలిపెళ్లి సువర్ణ-స్వామి
*కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రావరం ఎంపీటీసీ గాలిపెళ్లి సువర్ణ-స్వామి,రుద్రావరం గౌడ సంఘం అధ్యక్షుడు పార్వతి వేణు ,నాగుల మనోహర్,రుద్రావరం గౌడ సంఘం యువత అధ్యక్షుడు గాలిపెళ్లి బాబు,వంకాయల మహేష్ ల ఆధ్వర్యంలో సుమారు 200 మంది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.