నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
మాజీ జెడ్పిటిసి పోలీస్ ధర్మారావు
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలులో వైఫల్యం చెందిందని,నేడు రైతులను అష్ట కష్టాలు పెడుతూ యూరియా అందించలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెలకొన్నదని గీసుకొండ మండల మాజీ జెడ్పిటిసి పోలీస్ ధర్మారావు ఎద్దేవా చేశారు.
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు గీసుగొండ మండల బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కోనయమకుల,ఊకల్,మరియపురం మనుగొండ గ్రామలలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ
420 హామీల అమలు పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని రాష్ట్రంలో నెక్స్ట్ రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని జోష్యం చెప్పారు.
త్వరలో జరగబోయే స్థానికసంస్థల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు.కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు యూరియా కొరత అనేది లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటినుండి వ్యవసాయ సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడలసిన దుస్థితి ఏర్పడిందని అవేదన వ్యక్తం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దృష్ప్రచారాలను బిఆర్ఎస్ సోషల్ మీడియాలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.గీసుకొండ మండలంలో ఉన్న కొందరు బిఆర్ఎస్ శ్రేణులు కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి వెళ్లిన వాళ్ళని మరల తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని మాజీ జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు తెలిసి చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి వేణుగోపాల్,సమన్వయ కమిటీ సభ్యులు బోడకుంట్ల ప్రకాష్,అంకతి నాగేశ్వర్ రావు,పుండ్రు జైపాల్ రెడ్డి , ముంత రాజయ్య యాదవ్ ,కంబల కోటి,గుర్రం రఘు,యూత్ అధ్యక్షుడు శిరిసే శ్రీకాంత్, కోట్రా రఘుపతి రెడ్డి ,జక్కు మురళి,నమిండ్ల రాజు యూత్ నాయకులు కోట ప్రమోద్,చల్లా యూవసేన మండల అధ్యక్షుడు మంద రాజేందర్,దనుంజయ్,గ్రామాల అధ్యక్ష కార్యదర్శిలు,యూత్ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.