
బిఎస్పీ జిల్లా కార్యదర్శి ఐనాల పరశురాములు
మరిపెడ చిన్నగూడూరు నేటి ధాత్రి
నూతన దంపతులు ఆదర్శవంతంమైన జీవితం గడుపుతూ మహనీయుల లక్షాలకోసం కృషిచేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు కోరారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ చిన్నగూడూరు మండలం మంగోలిగూడెం గ్రామంలో బిఎస్పీ చిన్నగూడూరు మండల అధ్యక్షులు డెంకెల నవీన్ గౌడ్, శ్రీలతలు ఇటీవల ప్రేమవివాహం చేసుకున్న సందర్బంగా బిఎస్పీ జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు, లైవ్ బంజార రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త గుగులోత్ రమేష్ నాయక్, డోర్నకల్ అసెంబ్లీ మహిళ కన్వీనర్ జినక సువార్త దంపతులు వారి ఇంటికెళ్లి ప్రేమ వివాహం చేసుకున్న నవీన్ గౌడ్, శ్రీలతల దంపతులను ఆశీర్వదించారు.అనంతరం బిఎస్పీ మంగోలిగూడెం గ్రామ శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు గెలుపుకోసం శక్తివంచన లేకుండా కృషిచేయాలని పిలుపునిచ్చారు.అనంతరం మండల అధ్యక్షులు డెంకెల నవీన్ గౌడ్ గ్రామ పార్టీ అధ్యక్షులు గా గుగులోత్ అజయ్ నాయక్ ను నియమించారు.ఈకార్యక్రమంలో బిఎస్పీ మరిపెడ మండల అధ్యక్షులు జినక కృష్ణమూర్తి,గ్రామ అధ్యక్షులు గుగులోత్ అజయ్ నాయక్,స్థానిక నాయకులు సదినం భరత్, సదినం రమేష్, లూనావత్ భాసు నాయక్, లూనావత్ మహేష్ నాయక్,గుగులోత్ చరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.