నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి

ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు

ఛలో ఢిల్లీ వాల్ పోస్టర్ ఆవిష్కరిస్తున్న పుల్లని వేణు

చేర్యాల నేటిధాత్రి….

సోమవారం రోజున చేర్యాల పట్టణ కేంద్రంలో ఈనెల 12న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పార్లమెంట్ మార్కు సంబందించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ….. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని మండిపడ్డారు. కేంద్రం ప్రవేశ పెట్టిన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ చలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బిజెపి ప్రభుత్వం విద్యను కాషాయకరణ, కార్పోరేటీకరణ,
ప్రయి వేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తుందని విద్యను సామాన్యులకు దూరం చేయాలని చూస్తున్న బిజెపికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలన్నారు. ఈ విద్యా విధానం ద్వార పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.
తెలంగాణ విభజన హామీల మేరకు రాష్ట్రానికి వచ్చే విద్యాసంస్థలను ఇవ్వకుండా కక్ష్యపూరింతగా వ్యవహరిస్తోందని దానిని తిప్పికొట్టాలన్నారు. ఇందుకోసం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పార్లమెంట్ మార్క్ యువజన, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, మేధావులు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెల్డి సాయికిరణ్ రెడ్డి,ఎర్రోళ్ల అఖిల్, రాజేందర్, రాకేష్, అభిమన్యూ, కళ్యాణ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!